Friday, January 13, 2017

గౌరవించాల్సిన సంస్కృతి పండుగ : "సంక్రాంతి"

అన్ని మతాలవాళ్ళు, అన్ని కులాల వారు కల్సి జరుపుకునే పండుగ సంక్రాంతి. ఈ పండుగ వచ్చిందంటేనే చాలు అందరిలో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఒకప్పుడు సంక్రాతి వస్తే పది,పదిహేను రోజుల ముందు నుండే ఇల్లంతా శుభ్రం చేసుకుని, రుచి కరమైన పిండి వంటలు వండుకునేవారు. ఆ వంటకాలు ఐదు నుండి పది రకాల వంటకాలవరకూ చేసుకునేవారు. కాని ఇప్పుడు కాస్త ఎక్కువుగానే సంక్రాంతి హడావిడి తగ్గిపోయింది. కారణాలు అనేకం కావచ్చు. నిజానికి సంక్రాంతిలో ఉన్న గొప్పతనం ఎందులోనూ లేదు. ఇది నాలుగు రోజుల పండుగ. మొదటి రోజు భోగితో ప్రారంభమయ్యి చివరి రోజు ముక్కనుమ తో ముగుస్తుంది. భోగిరోజు పచ్చిపులుసు, అత్తెసరు, పెద్ద పండుగ నాడు పప్పు గారెలు,పకోడీలు, కనుమ నాడు నాటు కోడి మాంసం ముక్కనుమ రోజు ఏది బడితే అది. ఇదీ సంక్రాంతి షెడ్యూలు. ఇలాగే ఉండాలని లేదు. అయితే అత్యధికులు మాత్రo ఈవిధంగానే చేసుకుంటారు.
          ఏది,ఏమైనా సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరూ తమ స్థాయికి తగ్గట్టు, తమ స్తోమతను బట్టి కొత్త బట్టలతో హడావుడి చేస్తూ గడుపుతారు. ఇది అందరూ జరుపుకోవాల్సిన పండుగ. అందరూ కాపాడుకోవాల్సిన సంస్కృతి.

Friday, May 27, 2016

ఆ టైప్ అమ్మాయిలలో అవేర్ నెస్ తీసుకు రావాలా?

పార్క్ కు వెళ్ళినా,  బీచ్ కు వెళ్ళినా లవర్సే దర్శనమిస్తున్నారు. ఒకే ఐస్ క్రీమ్ ఇద్దరూ నాకుతున్నారు. సినిమా హాల్లో ప్రక్క,ప్రక్కనే కూర్చుని సోల్లు కబుర్లు చెబుకుంటున్నారు. వాళ్ళిద్దర్నీ చూస్తుంటే సముద్రంలో నది మిళితమైనట్టుగా కల్సిపోతున్నారు. మా వెధవ ప్రసాద్ గాడు సముద్రం ఎవరనుకుంటున్నావు? అమ్మాయే! ... Read more

Tuesday, May 24, 2016

నా నిజమైన స్నేహితులు ఎప్పటికీ పుస్తకాలే!

ప్రపంచంలో పుస్తకాన్ని మించిన నమ్మకమైన స్నేహితుడు మరొకరు లేరు.పుస్తకం మనకెప్పుడూ జ్ఞానాన్ని,సంస్కారాన్ని నేర్పుతుంది.దౌర్భాగ్యం ఏమిటంటే ఇప్పుడందరూ Facebook,twitter అనుకుంటూ ఎంతో సమయాన్ని వృధా చేస్తూనే ఉన్నారు.అవి వాడకూడదు అని నేను అనడం లేదు.గంటల తరబడి వాటి చుట్టూ తిరగడం తప్పు అని నా నిశ్చితాభిప్రాయం.నిజానికి ఆ సోషల్ సైట్స్ వల్ల నేర్చుకునేది ఏమీ లేదు.Facebookలో గడిపే Timeలో ఒక పది నిముషాలు మంచి పుస్తకం చదివితే ఎంతో నాలెడ్జ్ సంపాదించుకోవచ్చు.
       కందుకూరి వీరేశలింగం పంతులుగారు "చినిగిపోయిన చొక్కాని సూది,దారం పెట్టి కుట్టుకో.కాని కొత్త చొక్కా కొనే ఆ డబ్బులతో ఓ మంచి పుస్తకం కొనుక్కో"మన్నారు.
      ఇప్పుడన్నీ హైటెక్ చదువులయి పోయాలి.చదువుకునే రోజులు పోయి చదువుకొనే రోజులొచ్చేసాయి.చదువు ఇప్పుడు ప్రోత్సాహానికంటే అమిత భారాన్ని కలిగిస్తోంది.ర్యాంకుల కోసం బట్టి పట్టడం తప్ప నేర్చుకునేది ఏమీ ఉండడం లేదు.బహుశా మంచి పుస్తకాలు కూడా చదవడానికి యువత వెనుకాడడానికి కారణం ఇప్పటి చదువులేనేమో!
      నేను 8వ తరగతి చదివేటప్పుడు మా టీచర్ గారు "నేర్చుకోండి..నేర్చుకోండి" అనే వారు.ఆయన దృష్టిలో నేర్చుకోవడం అంటే చదువుకోవడం.అంటే బట్టీ పెట్టి చదవడడం కాదు.అవగాహణ చేసుకుంటూ చదవడం.అప్పుడు ఆయనను పిచ్చివాడని కామెంట్ చేసుకునే వాళ్లం. ఇప్పుడు మాకు తెలుస్తుంది.ఆయన మాటల యొక్క  మర్మం, గొప్పతనం.
     ఇకనుండైనా మనం పుస్తక పఠనాన్ని ప్రారంభించాలి.నెలకొచ్చీ ఎంతో వృధా ఖర్చు చేస్తాం.కనీసం నెలకి ఓ మంచి పుస్తకం కొంటే ఎంత ఉపయోగం.పుస్తకాల పట్ల నా దినచర్య క్రింది విధంగా ఉంటుంది.
  • నెలకి ఓ మంచి పుస్తకం కొంటాను.
  • ప్రతిరోజూ పడుకునే ముందు ఓ 15నిముషాలు చదువుతాను.
  • అంతే కాకుండా ఖాళీ కుదిరినప్పుడు,వీలు కుదిరినప్పుడు కూడా చదువుతాను.
  • ఒకవేళ ఎవరైనా నా బుక్ షెల్ఫ్ నుండి పుస్తకం తీసుకెళితే అతను చదివిన తరువాత కంపల్సరీ ఆ పుస్తకాన్ని తిరిగి తీసేసుకుంటాను.ఎందుకంటే పుస్తకాల పట్ల జాగ్రత్త లేనివారు పుస్తకాలు కూడా చదవరు.
  • నా ఆస్థి అంతా నిండుగా ఉన్న నా బుక్ షెల్ఫే.
మీరు కూడా పుస్తకాలు చదవండి.ఇతరులకు చదివే ప్రేరణను కలిగించండి.పుస్తకాలు మనల్ని తప్పనిసరిగా విజ్ఞానవంతున్ని చేస్తాయి.తలవంచి మనం పుస్తకం చదివితే అవి మనల్ని తలెత్తుకునేలా చేస్తాయి.శుభం.

Sunday, February 21, 2016

ఇది నా మొట్టమొదటి తెలుగు బ్లాగ్

బ్లాగ్ ప్రపంచం పరిచయమైన తరువాత నేను ప్రారంభించిన మొదటి బ్లాగిది. దేవుని దయవలన 75,000 వేల మందికి పైగా క్లిక్స్ సాధించింది. ఇక ఇది 100000 మైలురాయి సాధించిన తరువాత అప్డేట్స్ తగ్గించి వేస్తాను. నెలకి ఒక పోస్టు మాత్రమే పెడతాను. నా పర్సనల్ బ్లాగ్ ksc writes ని బాగా పాపులర్ చేయాలన్న నిశ్చయంతో ఉన్నాను. దానిలోనే మంచి,మంచి పోస్టులు పెట్టె ప్రయత్నం చేస్తాను.

Wednesday, February 10, 2016

ప్రేమ - యాక్సిడెంట్ కంటే ప్రమాదకరమైనది.

యాక్సిడెంట్ జరిగితే చనిపోవడమో లేక బ్రతకడమో  జరుగుతుంది. కాని ప్రేమ చచ్చే వరకూ వదిలిపెట్టదు. 

Thursday, January 7, 2016

ఇది మనుషులలో అజ్ఞానమా? మూర్ఖత్వమా?

నేటి రోజుల్లో మనిషి ఎంత ఉన్నతమైన స్థితికెదిగినా, ఎన్ని విద్యా పట్టాలు చేత బట్టినా మనిషిలో ఇంకా అజ్ఞానం పోలేదన్నడానికి క్రింది సంఘటనే ఒక ఉదాహరణ.
మార్నింగ్ వీడి గుమ్మం దగ్గర కూర్చుని మా మావయ్యగారితో కలిసి న్యూస్ పేపర్ చదువుతుండగా ఒక పెద్దామె ఫుల్ గా అలంకరించబడి ఉంది. బయటికెళ్లడానికి వీధి చివరి వరకూ అటు,ఇటూ చూస్తోంది. ఇంతకీ విషయమేమిటంటే ఒక విధవరాలు (భర్త లేని స్త్రీ) వస్తూ ఉంది. ఆమె ఎదురు మంచిది కాదని ఈ మేడమ్ గారు ఆగిపోయారు ఈమె ఒక స్కూల్ కి హెడ్మాస్టర్ గా చేస్తుంది. అయినా ఇంత అజ్ఞానమా? ఎదురు వల్ల ఏమైనా జరుగుతాయా? చెప్పండి? నా గురించి వాళ్ళు బయటికెళ్లడానికి బయపడుతున్నారని ఆ వితంతువుకి తెలిస్తే ఆమె మనస్సు గాయపడదా? ఇంతకన్నా దారుణమేముంది? ఈరోజుల్లో కూడా సైన్స్ ఇంత డవలప్ అయిన తరువాత కూడా ఇటువంటి మూడాచారాలను ఇంకా నమ్మడం మూర్ఖత్వమా? అజ్ఞానమా?
      మా గురువు గారు ఒక కథ చెప్తుండేవారు. ఒక రాజు ఉదయాన్నే నిద్రలేచి శయనమందిరం నుండి బయటికొస్తూ గుమ్మం గడపను తన్నుకుని పడిపోతే కాలి బొటనవేలుకు చిన్న దెబ్బ తగిలి రక్తం వచ్చింది. 
      రాజు గారు ఇదంతా గది బయట కాపలా వాడి ముఖం చూడడం వలనే జరిగిందన్న అజ్ఞానం లేక మూర్ఖత్వంతో ఆ భటునికి ఉరిశిక్ష ప్రకటించాడు.
     ఆ భటున్ని ఉరితీసే ముందు నీ చివరి కోరిక ఏమిటని ఉరి నిర్వహణాధికారులు అడిగిన దానికి ఆ భటుడు రాజు గారితో ఒకసారి మాట్లాడాలని చెప్పాడట!
    రాజుగారు వచ్చిన తరువాత ఆ భటుడు రాజుగారితో "ప్రభూ!.. మీతో ఒక విషయం విన్నపించుకోదలిశాను. మీరు రాత్రులు లోపల శయనమందిరంలో నిద్రపోయేవారు, బయట కాపలా ఉంటూ నేనూ నిద్రకు అప్పుడప్పుడూ జోగుతుందేవాడిని. ఉదయాన్నే మీ ముఖం నేను, నాముఖం మీరూ చూసుకునే వాళ్ళం. అయితే ఈరోజు నా ముఖం మీరు చూసినందుకు మీకు చిన్న కాలి దెబ్బ మాత్రమే తగిలింది. మీ ముఖం నేను చూసినందుకు ఏకంగా నాకు ఉరి శిక్షే పడిపోయింది. ప్రభువులు క్షమించాలి. మీ ముఖం వర్చస్ కంటే నా ముఖ వర్ససే గొప్పదని విన్నపించుకొదలిసాను. నాకంటే శిక్షాహార్హులు మీరేనని మనవి" అని చెప్పాడు. దానికి రాజు సిగ్గుతో తలదించుకుని ఉరి శిక్ష రద్దు చేసి వెళ్లిపోయాడు. ఎదురులు చూసేవాళ్ళు ఒకసారి ఆలోచిస్తే ఎంత అజ్ఞానపు నమ్మకాలు కలిగియున్నారో అర్ధమవుతుంది. కాబట్టి మూఢాచారాలకు మనుషులు దూరంగా ఉండాలి. ఈ విషయంలో మహాప్రవక్త ముహమ్మద్ (స) వారు ఎదురులు చూసేవారు,జ్యోతిషాలంట పడేవారు, దిష్టి బొమ్మలను వేలాడ దీసుకునే వారు పాపాత్ములని ప్రకటించారు.
ఈవీడియో చూడండి.కూడలి... poodanda...లేఖిని (Lekhini): Type in Telugu మాలిక: Telugu Blogs